కేజీఎఫ్ 2 కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లో ఎంతంటే?

Published on Apr 19, 2022 11:05 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్ 14న విడుదలైన “కేజీఎఫ్ చాప్టర్-2” కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.625 కోట్ల రూపాయలను వసూలు చేయగా, ఒక్క ఐదో రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేసింది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్ల రికార్డ్ ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

5 డేస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే
డే 1 – రూ.165.37 కోట్లు
డే 2 – రూ.139.25 కోట్లు
డే 3 – రూ.115.08 కోట్లు
డే 4 – రూ.132.13 కోట్లు
డే 5 – రూ. 73.29 కోట్లు
మొత్తం – రూ. 625.12 కోట్లు

సంబంధిత సమాచారం :