“ఆర్ఆర్ఆర్” అడుగుజాడల్లో రాకింగ్ స్టార్ యష్ “కేజీఎఫ్ 2”

Published on May 16, 2022 5:03 pm IST


రాకింగ్ స్టార్ యష్ నటించిన మాగ్నమ్ ఓపస్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికీ దేశవ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన శాండల్‌వుడ్ బిగ్గీలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పే పర్ వ్యూ మోడల్‌గా విడుదల చేయబడుతుందని ధృవీకరించింది. దీనిని ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (TVOD) అని కూడా పిలుస్తారు. ఈ చిత్రం మే 27, 2022న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడే అవకాశం ఉంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :