“కేజీయఫ్ 2” నుంచి వెరీ స్పెషల్ పోస్టర్ ని వదిలిన మేకర్స్.!

Published on Mar 8, 2022 5:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో అనేక అంచనాలు నెలకొల్పుకున్నా చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతుంది.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి సినిమాలో రాకీ పాత్ర ఎంత కారణమో దానికి ప్రేరణగా నిలిచిన తన పాత్ర కూడా అంతకు మించి కారణం అని అంతా ఒప్పుకునే మాట. తన తల్లికి ఇచ్చిన మాట మేరకే రాకీ అడుగులు వేస్తాడు. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్ కూడా ఈ సినిమా ఆ ట్రాక్ అనే చెప్పాలి.

ఇలా స్త్రీ శక్తి ట్రాక్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా అంతకు మించిన సాలిడ్ ఎలిమెంట్స్ చాప్టర్ 2 లో ఉండనున్నాయి. మరి తమ సినిమాలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి తమ లేడీస్ కోసం ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేసి వదిలారు.

మరి ఇందులో చాప్టర్ 2 లో కనిపించే కీలక పాత్రధారి ఈశ్వరి రావు, నటి రవీనా టాండన్(రమీకా సేన్), అర్చన జోయిస్(యష్ తల్లి పాత్ర) అలాగే నటి మాళవిక అవినాష్(జర్నలిస్ట్) లపై డిజైన్ చేసి ట్రిబ్యూట్ గా రిలీజ్ చేశారు. ఇది ఆసక్తిగా ఉందని చెప్పాలి. మరి ఈ భారీ సినిమా నుంచి ట్రైలర్ ఈ మార్చ్ 27న రాబోతుండగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రానున్న ఏప్రిల్ 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :