అక్కడ టాప్ 2 లోకి చేరువలో కేజీఎఫ్2…మామూలుగా లేదుగా!

Published on Apr 26, 2022 2:30 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్2. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాహుబలి 2 తర్వాత ఆ తరహాలో వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం. దాదాపు అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతోన్న ఈ చిత్రం బాలీవుడ్ లో సైతం దూసుకు పోతుంది. సోమవారం మరో 8 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇప్పటి వరకూ 329 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం దంగల్ రికార్డ్ కి చేరువలో ఉండటం విశేషం. బాహుబలి 2 టాప్ లో కొనసాగుతూ ఉండగా, మరికొద్ది రోజుల్లో దంగల్ రికార్డ్ ను వశం చేసుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :