‘కేజీఎఫ్‌ 2’లో స్పెషల్ సాంగ్‌.. హీరోయిన్‌ ఎవరు ?

Published on Jan 3, 2022 7:02 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం యాక్షన్ జోనర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా `కేజీఎఫ్ చాప్టర్- 2′ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఒక వింటేజ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారని తెలుస్తోంది.

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని ‘మెహబూబా.. మెహబూబా’ సాంగ్‌ ను `కేజీఎఫ్ చాప్టర్- 2’లో రీమిక్స్‌ చేశారట. మరి ఈ పాటలో ఆడిపాడిన బ్యూటీ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సాంగ్‌ కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా.. లేక అన్ని భాషల్లో ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

సంబంధిత సమాచారం :