“కేజీఎఫ్”లో రియల్ రాఖీ భాయ్ ఎవరో తెలుసా?

Published on Apr 22, 2022 3:01 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వచ్చిన “కేజీఎఫ్ చాప్టర్-2” కూడా ఏప్రిల్ 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. అయితే ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్‌గా రాసుకునీ మరీ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా తన కొడుకు కథ అని ఓ తల్లి అంటోంది.

కర్ణాటకకు చెందిన థంగం అనే వ్యక్తి కరుడు కట్టిన నేరస్థుడు. కోలార్ గనుల్లో పని చేస్తూనే ఒక గ్యాంగ్‌ని మెయింటెన్ చేస్తూ బంగారాన్ని కొల్లగొట్టేవాడు. కొట్టేసిన బంగారాన్ని జనాలకు కూడా పంచుతూ జూనియర్ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. చివరికి 1997లో పోలీసుల చేతిలో ఎంకౌంటర్ అయ్యాడు. అయితే ఇదే థంగం జీవిత కథ ఆధారంగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తుంది అతడి తల్లి పాలీ. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని, తన కొడుకును సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె ఆరోపించారు.

సంబంధిత సమాచారం :