లేటెస్ట్ : ‘దేవర’ లో కీలక పాత్ర చేయనున్న ‘కెజిఎఫ్’ నటుడు ?

లేటెస్ట్ : ‘దేవర’ లో కీలక పాత్ర చేయనున్న ‘కెజిఎఫ్’ నటుడు ?

Published on May 27, 2023 11:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర. ఇటీవల టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. దానికి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ మాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన దేవర మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనికి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. దాని ప్రకారం ఈ మూవీలో కెజిఎఫ్ నటుడు తారక్ పొన్నప్ప ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీలో అండ్రుస్ కి సెక్రటరీ పాత్రలో కనిపించారు. జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తరువాత కొన్నేళ్ల అనంతరం ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర తప్పకుండా రిలీజ్ తరువాత అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లో పలు భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు