వైరల్ పిక్ : ప్రధాని నరేంద్రమోడీ ని కలిసిన కెజిఎఫ్, కాంతారా హీరోలు

Published on Feb 13, 2023 11:45 pm IST


ఇటీవల పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కిన కన్నడ సినిమాలైన కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 తో పాటు కాంతారా సినిమాలు ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ సిరీస్ సినిమాల్లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించగా కాంతారా మూవీలో హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ రెండు సినిమాలు గత ఏడాది ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్ అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమ యొక్క స్థాయికి విపరీతంగా పెంచాయి.

కాగా ఈ సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మించారు. అయితే విషయం ఏమిటంటే, నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు హీరోలు యష్, రిషబ్ శెట్టి, హోంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్. నిన్నటి తన కర్ణాటక షెడ్యూల్ లో పలు కార్యక్రమాల అనంతరం ప్రధానిని వీరు కలవడం ప్రత్యేకతని సంతరించుకుంది. కాగా ప్రధానిని కలిసేందుకు వీరితో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని కూడా వచ్చారు. మొత్తంగా ప్రస్తుతం వీరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :