ప్రస్తుతం మన దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలలో భారతదేశం అంతటా ఎంతగానో ఎదురు చూస్తున్న వాటిలో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. అయితే దీనికి ముందు వచ్చిన చాప్టర్ 1 మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి ముద్ర వేసుకుందో అందరికీ తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యి అన్ని భాషలలోను ఊహలకు మించిన విజయాన్నే అందుకుంది.
అలాగే డిజిటల్ గా కూడా మన ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే భారీ వ్యూవర్ షిప్స్ ను కూడా రాబట్టుకుంది. మొదటి పార్ట్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ నమోదు అయితే ఇక రెండో పార్ట్ ఎలా ఉంటుందో అని అంతా ఊహించుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అన్నదానికి చిన్న ఉదాహరణ ఇప్పుడు తెలుస్తుంది.
కేజీయఫ్ మొదటి చాప్టరే ఓ స్థాయిలో ఉంది అనుకుంటే ఇప్పుడు రాబోతున్న సెకండ్ పార్ట్ కి మొదటి పార్ట్ జస్ట్ చిన్న ట్రైలర్ లాంటిది దీని కంటే చాప్టర్ 2 వేరే లెవెల్లో ఉండబోతుంది అని ఖచ్చితంగా అందరు ఎన్ని అంచనాలు పెట్టుకుంటున్నారో వాటన్నిటినీ మించే రేంజ్ లో ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
