హిందీలో కాస్త స్లో అయ్యిన “కేజీయఫ్ 2”..లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

Published on May 13, 2022 4:00 pm IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “కేజీయఫ్ 2”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ సీక్వెల్ అన్ని అంచనాలు అందుకొని వసూళ్ల సునామి సృష్టించింది. ముఖ్యంగా అయితే హిందీ బెల్ట్ లో అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ నే అందుకొని ఏకంగా 400 కోట్ల వసూళ్లను ఈ చిత్రం అందుకుంది.

అయితే ఇపుడు నెల రోజులు రన్ కి వచ్చేసరికి ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ దగ్గర కాస్త స్లో అయ్యినట్టు అనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం నిన్న గురువారం 1.7 కోట్లు నెట్ వసూళ్ళని అందుకుంది. దీనితో ఈ సినిమా హిందీలో 420 కోట్ల మార్క్ కి చేరుకుంది. అయితే ఇప్పటికే అక్కడ రెండో స్థానంలో ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో అయితే బాహుబలి 2 ని చేరుకుంటుందో లేదో అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :