బుక్ మై షో లో “కేజీయఫ్” సెన్సేషన్..బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 7, 2022 12:50 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మరో మోస్ట్ అవైటెడ్ సినిమాగా రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. డెఫినెట్ గా మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ ని నమోదు చెయ్యడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యిన నాటి నుంచే రికార్డులు నమోదు చెయ్యడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా అయితే ఈ సినిమా అప్పట్లోనే బుక్ మై షోలో ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని విధంగా లక్ష ఇంట్రెస్ట్ లు నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు నెలకొల్పగా ఇప్పుడు ఈ సినిమా సెన్సేషనల్ గా 1 మిలియన్ ఇంట్రెస్ట్స్ ని నమోదు చేసింది.

దీనితో 1 మిలియన్ మార్క్ అందుకొన్న మరో సౌత్ ఇండియన్ సినిమాగా అలాగే మొట్టమొదటి కన్నడ సినిమాగా ఇది రికార్డు సెట్ చేసింది. మరి దీనితో పాటుగా పవన్ బుకింగ్స్ పై కూడా లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది రేపు ఏప్రిల్ 7 నుంచి ఈ సినిమా బుక్ మై షో మరియు పే టి ఎం లలో హిందీ మరియు తమిళనాడు బుకింగ్స్ ఓపెన్ చెయ్యనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే తెలుగు మరియు కన్నడ బుకింగ్స్ కి సంబంధించి ఐ=ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :