హిందీలో రికార్డు ఫిగర్ కి చేరువలో “కేజీయఫ్ 2” వసూళ్లు.!

Published on Apr 29, 2022 3:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2”. మన ఇండియన్ సినిమా దగ్గర చాలా అంచనాలతో వచ్చిన సీక్వెల్ గా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ తోనే రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా ట్రేడ్ వర్గాలని అయితే హిందీలో అదరగొట్టింది.

అక్కడ ఫాస్టెస్ట్ 300 కోట్ల క్లబ్ కి చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు మార్క్ కి చేరుకుంటుంది. లేటెస్ట్ గా నిన్నటి గురువారంకి గాను 5.6 కోట్ల నెట్ వసూళ్ళని అందుకోగా దీనితో ఈ చిత్రం 349 కోట్ల దగ్గుకి చేరుకొని 350 కోట్లకి అతి చేరువలో ఉంది. మరి దానిని ఈ రోజుతో క్రాస్ చేసేస్తోంది అని చెప్పాలి. ఇక దీని తర్వాత అయితే నెక్స్ట్ టార్గెట్ 400 కోట్లే అని చెప్పాలి. మరి ఇది ఎప్పుడు టచ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :