రికార్డు సెంటర్స్ లో “కేజీయఫ్ 2” 50 డేస్ సాలిడ్ రన్.!

Published on Jun 2, 2022 1:01 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా “కేజీయఫ్ చాప్టర్ 2”. తమ కాంబోలో వచ్చిన చాప్టర్ 1 కి సీక్వెల్ గా ఎన్నో అంచనాలు నెలకొల్పుకుని ఈ ఏడాదిలో మరో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు 50 రోజుల వేడుకకి చేరుకుంది.

అయితే ఈ సినిమా మొత్తం ఇండియా వైడ్ రికార్డు మొత్తంలో 390 కి పైగా సెంటర్స్ లో కంప్లీట్ చేసుకోగా ఓవర్సీస్ లో అయితే పదికి పైగా సెంటర్స్ లో 50 రోజుల మైల్ స్టోన్ ని కంప్లీట్ చేసుకొని కన్నడ సినిమా నుంచి భారీ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ భారీ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :