బుక్ మై షోలో “కేజీయఫ్ 2” భారీ రికార్డు సెట్ చేసిందట.!

Published on May 28, 2022 9:55 am IST

ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. రికార్డు స్థాయి వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో భారీ రికార్డు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి మొత్తం ఇండియన్ వైడ్ ఒక్క బుక్ మై షో లో ఏకంగా 17 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇది ఇండియన్ సినిమా దగ్గర అయితే ఒక భారీ రికార్డు అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :