హిస్టారికల్ “కేజీయఫ్ 2”..1000 కోట్ల వసూళ్లతో సెన్సేషన్.!

Published on Apr 30, 2022 2:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” అనేక అంచనాల నడుమ వచ్చి ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో తెలిసిందే. పార్ట్ 1 ని మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ అంతకంతకు పెరిగి రికార్డు వసూళ్లను కొల్లగొట్టింది.

మరి ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్ళని అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ ఏడాదిలో రెండో 1000 కోట్ల సినిమాగా అలాగే మన ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2, దంగల్ మరియు లేటెస్ట్ రౌద్రం రణం రుధిరం చిత్రం తర్వాత ఇప్పుడు చేరిన ఏకైక కన్నడ సినిమాగా అలాగే నాలగవ ఇండియన్ సినిమాగా కేజీయఫ్ 2 సెన్సేషన్ ని నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :