మాన్స్టర్ “కేజీయఫ్ 2” 50 రోజుల్లో ఎంత వసూళ్లకి చేరింది అంటే.!

Published on Jun 2, 2022 7:05 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా రికార్డు రెస్పాన్స్ తో వచ్చి ఈ ఏడాదిలో అలాగే ఇండియన్ సినిమా దగ్గర ఒక హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా ఇది నిలిచింది. అయితే ఈరోజుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ ఎత్తున సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఈ 50 రోజుల వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇంట్రెస్టింగ్ నెంబర్ తో 1 వెయ్యి 2 వందల 35 కోట్లు గ్రాస్ వసూలు అయ్యినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా థియేట్రికల్ రన్ అయితే కొనసాగుతుంది. అలాగే ఈ జూన్ 3 నుంచే స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఇక ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా రవి బసృర్ సంగీతం ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :