ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర “కేజీయఫ్ 2” ఫస్ట్ డే వసూళ్లు ఇవే.!

Published on Apr 15, 2022 4:08 pm IST


ఈ ఏడాదిలో మరో భారీ రిలీజ్ గా వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసిన ఈ భారీ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ క్రేజీ సీక్వెల్ వసూళ్ళ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.

మరి వాటికి సమాధానంగా ఫస్ట్ డే ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత రాబట్టిందో స్వయంగా చిత్రణ నిర్మాణ సంస్థ హోంబలే వారె అనౌన్స్ చేశారు. మరి వారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 134.5 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టు తెలిపారు.

మరి ఇది భారీ నంబర్ అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ వసూళ్లతో ఇండియాలో ఈ సినిమా మూడో అత్యధికం అని తెలుస్తోంది. మరి దీనికన్నా ముందు రాజమౌళి భారీ సినిమాలు రౌద్రం రణం రుధిరం మరియు బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :