హిందీలో ఈరోజుతో మరో రికార్డు మార్క్ క్రాస్ చేయనున్న “కేజీయఫ్ 2”.!

Published on Apr 24, 2022 11:19 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్ళని అందుకుంటూ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ కొత్త రికార్డులు సెట్ చేస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమా హిందీలో సాలిడ్ రన్ ని కనబరుస్తుంది. ఇక్కడ మరో సెన్సషనల్ మైల్ స్టోన్ 300 కోట్లకి జస్ట్ దగ్గరలో ఉంది. నిన్న శనివారంకి గాను ఈ చిత్రం హిందిలో 18 కోట్లకి పైగా నెట్ వసూళ్ళని అందుకొని 298 కోట్లకి చేరింది అట. దీనితో ఈరోజు ఆదివారంతో ఈ చిత్రం 300 కోట్ల మార్క్ ని క్రాస్ అయ్యిపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి అయితే నెక్స్ట్ టార్గెట్ 400 కోట్లకి ఈ చిత్రం వెళుతుంది. దీన్నెప్పుడూ క్రాస్ చేస్తుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :