అనుకున్న తేదీకే “కేజీఎఫ్ చాప్టర్ 2” విడుదల

Published on Sep 26, 2021 10:31 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం కేవలం కన్నడ లో మాత్రమే కాకుండా, సౌత్ నుండి నార్త్ వరకూ కూడా విడుదల అయిన అన్ని ప్రాంతాల్లో తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్2 షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదల కి సిద్దం అవుతోంది.

అయితే కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడుతూ వస్తుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో మళ్ళీ వాయిదా పడింది. ఇటీవల చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ సరికొత్త విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, 2022 కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే వచ్చే ఏడాది వరుస సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యం లో కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీ మారనుంది అంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ మేరకు మరొకసారి ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం అనుకున్న తేదికే విడుదల కానుంది.

ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా (విలన్) పాత్రలో నటిస్తున్నారు. రవీనా టాండన్ సైతం మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సౌత్ నుండి మరికొంత మంది నటిస్తుండటం, విడుదల అయిన టీజర్ ఇండియా లోనే భారీ రికార్డ్ ను కొల్లగొట్టడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :