ఈ షూట్ లో బిజీగా “కేజీయఫ్ చాప్టర్ 2”.!

Published on Dec 24, 2021 9:00 am IST


పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అన్ని భాషల్లో కూడా ఎదురు చూస్తున్న భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉంది.

అయితే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ని నీల్ కంప్లీట్ చేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ భారీ సినిమా మేకర్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారట. కొన్ని ప్యాచ్ వర్క్స్ ఇప్పుడు వారు కంప్లీట్ చేస్తున్నారట. మరి ఈ షూటింగ్ లో హీరో యష్ మరియు హీరోయిన్ శ్రీనిధి శెట్టి లు పై సన్నివేశాలను నీల్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ షూటింగ్ తో ఇక మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టే అట. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రశాంత్ నీల్ ఎప్పుడో స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం యష్ స్పాట్ లో గల ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :