“కేజీయఫ్ 2” నుంచి వేరే లెవెల్లో ఉన్న అప్డేటెడ్ మాస్ సాంగ్.!

Published on Apr 13, 2022 1:59 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇంత క్రేజ్ నెలకొనడానికి ఉన్న ఎన్నో కారణాల్లో సంగీత దర్శకుడు రవి బాసృర్ మొదటి పార్ట్ కి ఇచ్చిన పాటలు గాని ఆ ఎలివేషన్ సీన్స్ కి సంగీతం అనే చెప్పాలి.

అలాగే ఆ సినిమాలో “ధీర ధీర” సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ కూడా తెలిసిందే. మరి ఒక సినిమాకి సీక్వెల్ అంటే అందులో మొదటి సినిమాకి కొనసాగింపుగా కొంచెం అప్డేటెడ్ కూడా గ్యారెంటీ అలా ఇపుడు రిలీజ్ చేసిన “సుల్తానా” సాంగ్ కూడా అలాగే ఉందని చెప్పాలి. అలాగే సినిమాలో కూడా ఈ సాంగ్ వేరే లెవెల్లో ఉండేలా అనిపిస్తుంది. పక్కాగా మాస్ అండ్ బేస్ బీట్ లో ఉందని చెప్పాలి మొత్తానికి అయితే సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్ సినిమాపై మరింత హైప్ పెంచేదిలా ఉందని చెప్పాలి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :