తమిళ నాట సూపర్ స్ట్రాంగ్ గా “కేజీయఫ్ 2” సినిమా.!

తమిళ నాట సూపర్ స్ట్రాంగ్ గా “కేజీయఫ్ 2” సినిమా.!

Published on Apr 21, 2022 1:30 PM IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ గా నిలిచి సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమా సౌత్ ఇండియా లో అన్ని కీలక ప్రాంతాల్లో మంచి వసూళ్ళని నమోదు చేస్తుంది.

ముఖ్యంగా తమిళ నాట బీస్ట్ లాంటి సినిమా ఉన్నా కూడా కేజీయఫ్ 2 కి సాలిడ్ రన్ నమోదు అవుతుండగా అక్కడ మరిన్ని థియేటర్స్ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా పట్ల చాలా డిమాండ్ నెలకొంది అందుకే ఆడియెన్స్ రిక్వెస్ట్ మేరకు యాడ్ చేస్తున్నారట. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే తమిళనాడులో దాదాపు 190కి పైగా థియేటర్స్ కేజీయఫ్ 2 కి పెరిగినట్టు తెలుస్తుంది. దీనితో తమిళ వెర్షన్ లో ఈ సినిమా మంచి హిట్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు