చెన్నైలో రికార్డు మార్క్ కి దగ్గరలో “కేజీయఫ్ 2” వసూళ్లు.!

Published on May 23, 2022 2:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. అనేక అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో ఇండియన్ సినిమా దగ్గర ఈ ఏడాదికి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరి పర్ఫెక్ట్ పాన్ ఇండియా హిట్ గా అన్ని భాషల్లో కూడా అదరగొట్టిన ఈ చిత్రం తమిళ నాట ఇంకా సాలిడ్ రన్ ని కొనసాగితున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. లేటెస్ట్ గా అక్కడ ఒక్క చెన్నై సిటీలోనే ఈ సినిమా భారీ లెవెల్లో 10.85 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే డెఫినెట్ గా 11 కోట్ల మార్క్ ని కూడా ఈ చిత్రం డెఫినెట్ గా క్రాస్ చేస్తుందని ట్రేడ్ పీపుల్ అంటున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా ఇంకా మంచి రన్ ని కొనసాగిస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :