“కేజీఎఫ్ చాప్టర్ 2” సరికొత్త రిలీజ్ డేట్…మరో పోస్టర్ విడుదల!

Published on Aug 22, 2021 4:03 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి, పాన్ ఇండియా మూవీ గా మారింది. కేజీఎఫ్ చాప్టర్ 2 అంటూ మొదటి పార్ట్ గా కొనసాగింపు తో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం ఒకే ఒక్క టీజర్ తో ఇండియా నే షేక్ చేసింది ఈ చిత్రం.

ఈ చిత్రం కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ సరికొత్త విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించి సరికొత్త పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా (విలన్) పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం గా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :