రెండో రోజు కూడా నైజాంలో “కేజీయఫ్ 2” సాలిడ్ వసూళ్లు.!

Published on Apr 16, 2022 10:45 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ వసూళ్ళని ఓపెనింగ్ డే కి అందుకుంది.

మరి నైజాం లో అయితే మొదటి రోజే మన స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో 9 కోట్లకి పైగా షేర్ ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా చాలా స్వల్ప డ్రాప్ లో ఏకంగా 7.3 కోట్ల రూపాయల షేర్ ని అందుకుని గట్టి హోల్డ్ ని కనబరిచింది. దీనితో ఈ రెండు రోజుల్లోనే ఈ చిత్రం 17 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసేసింది.

మొత్తానికి అయితే నైజాం లో కేజీయఫ్ 2 మంచి వసూళ్లనే రాబడుతుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందివ్వగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :