యూఎస్ లో “కేజీయఫ్ 2” లేటెస్ట్ సెన్సేషన్.!

Published on Apr 17, 2022 2:00 pm IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” ఇప్పుడు రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకొని. రోజు రోజుకి స్ట్రాంగ్ వసూళ్ళని అందుకుంటూ విడుదల అయ్యిన అన్ని చోట్లా కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా సెన్సేషన్ ని నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

తాజాగా నిన్న శనివారం ఒక్కరోజే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసిందట. ఇలా ఓ కన్నడ సినిమా సింగిల్ డే లో అది కూడా శనివారం 1 మిలియన్ మార్క్ అందుకోవడం ఫస్ట్ టైం అని తెలుస్తుంది. అలాగే దీనితో ఈ సినిమా అక్కడ 4 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయింది. మొత్తానికి అయితే ఓవర్సీస్ లో కూడా కేజీయఫ్ హవా గట్టిగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :