ట్విట్టర్ లో “కేజీయఫ్ 2” కి లైవ్ అయ్యిన స్పెషల్ ఎమోజిస్.!

Published on Apr 9, 2022 9:02 am IST


ఓ సినిమాని ప్రేక్షకులలోకి బలంగా తీసుకెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన పనే ఆ సినిమాకి కావాల్సిన ప్రమోషన్స్. ఎంత మంచి సినిమా తీసినా కూడా దానికి తగ్గ ఫలితం కావాలి అంటే ప్రస్తుత రోజుల్లో ప్రమోషన్స్ తోనే జరిగే పని. అయితే మన తెలుగు సినిమా నుంచి అయితే ఈ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే దర్శకుడు రాజమౌళి.

లేటెస్ట్ గా తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా కి ఓ రేంజ్ లో చేశారు. ఇక దీని తర్వాత మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాని ఈ సినిమా యూనిట్ కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే ట్విట్టర్ లో కూడా మరింత స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ట్విట్టర్ యాజమాన్యం నుంచి అయితే ఈ సినిమాపై కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కి గాను హీరో పాత్రకి చెందిన ఎమోజిలు కనిపిస్తున్నాయి. ఈరోజు నుంచే నుంచే ఇవి లైవ్ అయ్యినట్టు తెలుస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ ని మరింత చెయ్యడానికి మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :