తమిళ నాట “బీస్ట్” ఉన్నా “కేజీయఫ్ 2” కే గట్టి డిమాండ్.?

Published on Apr 23, 2022 7:01 pm IST

రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయ్యిన భారీ సినిమాలు “బీస్ట్” మరియు “కేజీయఫ్ చాప్టర్ 2” లు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా “బీస్ట్” కాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం “కేజీయఫ్ 2”. మరి ఈ సినిమాలతో వచ్చి ఈ ఇద్దరు హీరోలు భారీ ఓపెనింగ్స్ ని అందుకున్నారు. కానీ ఫైనల్ గా మాత్రం పై చేయి యష్ దే అయ్యిందని చెప్పాలి.

తమిళ నాట అయితే ఒకింత బీస్ట్ కే భారీ వసూళ్లు వచ్చినా కొన్ని రోజులకి థియేట్రికల్ రన్ విషయానికి వస్తే కేజీయఫ్ 2 నే విన్నర్ గా నిలిచినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ బుకింగ్స్ చూసుకున్నా అక్కడ ప్రేక్షకుల డిమాండ్ చూసినా కేజీయఫ్ 2 కే గట్టిగా ఉన్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా కేజీయఫ్ 2 కి ఆడియెన్స్ కోరిక మేరకు అదనపు షోలు మరియు స్క్రీన్ లు కూడా యాడ్ చేస్తున్నారట. దీనితో అక్కడ బీస్ట్ లాంటి సినిమా ఉన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఫైనల్ గా కేజీయఫ్ 2 కే బ్రహ్మరథం పట్టినట్టు అయ్యిందని చెప్పాలి. మరి కేజీయఫ్ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా బీస్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :