నైజాంలో “కేజీయఫ్ 2” మూడో వసూళ్లు వివరాలు.!

Published on Apr 17, 2022 1:00 pm IST


లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న మరో భారీ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం అందరికీ తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ రన్ ని కనబరుస్తుంది.

మరి మొదటి రెండు రోజులు కూడా మంచి వసూళ్ళని సాధించిన ఈ సినిమా తాలూకా మూడో రోజు నైజాం లో వసూళ్ల వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి ఈ మూడో రోజు నైజాం లో ఈ చిత్రం 5.8 కోట్ల షేర్ ని అందుకోగా ఈ మూడు రోజులకి గాను 22.7 కోట్ల రూపాయల షేర్ ని అందుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే ఇక్కడ ఆల్ మోస్ట్ అనుకున్న టార్గెట్ కి దగ్గరలో ఉన్నట్టే అని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందివ్వగా హోంబలే వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :