హిందీలో 2 రోజులకే రికార్డు మార్క్ టచ్ చేసిన “కేజీయఫ్ 2” వసూళ్లు.!

Published on Apr 16, 2022 2:00 pm IST

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కన్నడ ఇండస్ట్రీ సినిమా ఛార్జ్ తీసుకుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. సినిమాపై ఉన్న హైప్ కి ప్రామిసింగ్ ఓపెనింగ్స్ అందుకొని ఇండియాలో భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు వసూళ్లనే నమోదు చేసింది.

ఇక రెండో రోజు కూడా ఈ సినిమా స్ట్రాంగ్ వసూళ్లనే రాబట్టినట్టు తెలిసింది. రెండో రోజుకి గాను ఈ చిత్రం ఏకంగా 46.79 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని అందుకుంది. దీనితో కేవలం ఈ రెండు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఈ శని, ఆది వారాల్లో మరింత స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా హిందీలో మాత్రం డెఫినెట్ గా వండర్స్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

సంబంధిత సమాచారం :