కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుండి అప్డేట్స్ షురూ…ఫ్యాన్స్ కి ఫస్ట్ ఆప్షన్!

Published on Feb 23, 2022 2:30 pm IST


సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ను ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.

నిరీక్షణ చాలా బాధాకరంగా ఉందని మాకు తెలుసు. కానీ, KGF చాప్టర్ 2 యొక్క సంగ్రహావలోకనం పొందడానికి మా ప్రియమైన అభిమానుల ఆత్రుతను చూడటానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ముందుగా ఏమి చూడాలనుకుంటున్నారు? KGF సైన్యం తదుపరి కదలికను నిర్ణయించనివ్వండి. అంటూ ట్రైలర్ లేదా సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు. హాంబలే ఫిల్మ్స్ చేసిన ఈ పోస్ట్ పై ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ ఆప్షన్ ను ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :