టాక్..”కేజీయఫ్ 2″ కి ఒరిజినల్ కన్నా తెలుగులోనే ఎక్కువ వసూళ్లు.?

Published on Apr 9, 2022 3:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ మళ్ళీ ఇంకో సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాడని ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టిలు హీరో హీరోయిన్స్ గా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ సినిమాపై నెలకొన్న అంచనాలు కూడా అన్ని ఇన్ని కావు.

అయితే అనూహ్యంగా ఈ సినిమాకి ఒరిజినల్ కన్నడ భాష కన్నా తెలుగులోనే భారీ క్రేజ్ మరియు డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది రీసెంట్ గా ట్రైలర్, పాటలు తో క్లారిటీ కాగా ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ పరంగా కూడా కన్నడ లో కంటే తెలుగులో ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని ఫిల్మ్ ట్రాకర్స్ చెబుతున్నారు. తెలుగులో ఉన్న క్రేజ్ గాని ఆడియెన్స్ చూస్తున్న ఎదురు చూపులకి గాని కన్నడలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :