‘కెజిఎఫ్ చాప్టర్ – 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సర్వం సిద్ధం … !

‘కెజిఎఫ్ చాప్టర్ – 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సర్వం సిద్ధం … !

Published on Aug 20, 2022 9:32 PM IST

రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా లేటెస్ట్ తెరకెక్కిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఈశ్వరిరావు, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి భువన గౌడ కెమెరా మ్యాన్ గా పని చేసారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్ అందుకుని ప్రేక్షకాభిమానులని అలరించిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీలో హీరో యష్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అత్యద్భుత టేకింగ్, భారీ మాస్ యాక్షన్ సీన్స్, గ్రాండియర్ విజువల్స్, ఫైట్స్, సాంగ్స్, బీజీఎమ్ ఇలా అన్ని కూడా ఈ మూవీ భారీ సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఇక ఈ మూవీ ఆగష్టు 21న సాయంత్రం 5 గం. 30 ని. లకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో తొలిసారిగా ప్రసారం కానుంది. అయితే ఈ భారీ మూవీ ఏ స్థాయిలో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది, అలానే ఎంతమేర టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంటుంది అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు