కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్ 14న విడుదలైన “కేజీఎఫ్ చాప్టర్-2” కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీక్‌లోనే బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బద్దలు కొట్టి దూసుకుపోతోంది.
మొదటి నాలుగు రోజులు, హాలీ డేస్ ఉండడంతో కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాలల రూ. 0.94 కోట్ల షేర్ (రూ. 1.60 కోట్లు) చేయంగా రేంజ్లో షేర్‌ను సాధించింది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇంకా తెలుగులో ఇంకా రూ. 3.35 కోట్ల షేర్ రాబట్టాలి. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా ఏపీలో పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. కెజియఫ్ 13 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 466.25కోట్ల షేర్ (రూ. 942.75 కోట్ల గ్రాస్)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్లో బిజినెస్ చేయగా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
నైజాం (తెలంగాణ) – రూ. 39.08కోట్లు / రూ. 25కోట్లు
1) సీడెడ్ (రాయలసీమ) ఇ రూ. 10.54
2) ఉత్తరాంధ్ర – రూ. 6.89 కోట్లు / రూ. 10 కోట్లు
ఈస్ట్: రూ. 5.15 కోట్లు / రూ. 7 కోట్లు
వెస్ట్: రూ. 3.22 కోట్లు రూ. 6 కోట్లు
గుంటూరు: రూ. 4.21 కోట్లు / రూ. 7 కోట్లు
కృష్ణా: రూ. 3.81 కోట్లు / రూ. 6కోట్లు
నెల్లూరు:రూ. 2.55 కోట్లు / రూ. 3 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో రూ. 75.45 కోట్లు షేర్ (రూ. 121.30 కోట్లు గ్రాస్) రాబట్టింది.