“సలార్” సస్పెన్స్ ఎలిమెంట్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on Apr 8, 2022 11:01 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి లేటెస్ట్ భారీ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. నీల్ నుంచి వస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” తర్వాత సినిమా ఇది కావడంతో అందులోని ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ తో కావడంతో నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు కేజీయఫ్ సినిమా రిలీజ్ అవుతుండడంతో సలార్ పై కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ఈ సినిమా స్టార్ట్ అయ్యిన కొన్ని నెలలకి ఈ చిత్రం ఒక రీమేక్ అని టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అది కూడా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా “ఉగ్రం” కి రీమేక్ ని అన్నారు.

తర్వాత ఇది రీమేక్ కాదని డైరెక్ట్ సినిమానే అని కొంతమంది అన్నా ఇది సస్పెన్స్ గానే నిలిచిపోయింది. మరి లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా రీమేక్ కాదని డైరెక్ట్ సినిమా మాత్రమే అని అసలు ఉగ్రం కి దీనికి సంబంధం లేదని తెలిపాడు. దీనితో రీమేక్ అనుకునే వారి అందరికీ ఒక ఫైనల్ క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :