ఆ హీరోయిన్లు కంటే నాలుగు లక్షలు ఎక్కువ కావాలట !

Published on May 30, 2022 1:11 am IST

శ్రీ‌నిధి శెట్టి `కేజీఎఫ్‌` సినిమాతో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి భారీ ఆఫ‌ర్లు వస్తున్నాయి. దాంతో తాజాగా ఈ క్రేజీ బ్యూటీ పై తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. `కేజీఎఫ్‌` సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో.. తన రెమ్యూనరేషన్ ను శ్రీ‌నిధి భారీగా పెంచేసిందట. సౌత్‌ లో స్టార్ హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే నాలుగు లక్షలు ఎక్కువ ఇవ్వండి అంటూ నిర్మాతల పై ఒత్తిడి పెంచుతుందట.

అయినా, `కేజీఎఫ్‌` హిట్ అయ్యింది, శ్రీ‌నిధి శెట్టి వల్లే అనుకుంటే ఎలా ?, సహజమే.. హిట్ వచ్చాక రెమ్యూనరేషన్ ను పెంచొచ్చు. కానీ.. అడ్డగోలుగా నోటికొచ్చినంత అడిగితే.. ఎలా గిట్టుబాటు అవుతుంది. నిజానికి శ్రీ‌నిధి శెట్టి ఇటీవల ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ‘మీకు పేరు కావాలా ? లేక, డబ్బు కావాలా ? అంటూ ఒక ప్రశ్న అడిగాడు. ఈ రెండిటిలో శ్రీ‌నిధి శెట్టి చాలా ఓపెన్ గా ‘నాకు డ‌బ్బే కావాలంటూ మొహమాటం లేకుండా చెప్పింది. మొత్తానికి శ్రీ‌నిధి శెట్టి డబ్బుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉంది.

సంబంధిత సమాచారం :