వైరల్ పిక్స్ : కెజిఎఫ్ స్టార్ యష్ తో టిడిపి యువ కెరటం నారా లోకేష్

వైరల్ పిక్స్ : కెజిఎఫ్ స్టార్ యష్ తో టిడిపి యువ కెరటం నారా లోకేష్

Published on Dec 15, 2022 6:00 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ యువ నటుడు యష్ హీరోగా రూపొందిన కెజిఎఫ్ చాప్టర్ 1, అలానే చాప్టర్ 2 మూవీస్ రెండూ కూడా ఇటీవల రిలీజ్ తరువాత ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి అత్యద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ గా హీరో యష్ ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక మరోవైపు తెలుగు దేశం పార్టీ అద్యక్షడు నారా చంద్రబాబు కుమారుడు యువ కెరటం నారా లోకేష్ ప్రస్తుతం ఆ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరుతో కొనసాగుతున్నారు.

అయితే విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ ని హీరో యష్ ప్రత్యేకంగా కలిశారు. దాదాపుగా అరగంటకు పైగా వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. కాగా వీరిద్దరి ప్రత్యేక భేటీకి గల కారణంతో పాటు, వీరి మధ్య ఎటువంటి అంశాలు చర్చికు వచ్చాయి అనే పూర్తి వివరాలు వంటివి మాత్రం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా యష్, లోకేష్ ల భేటీ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు