లేటెస్ట్..భారీ డీల్ ని వదిలేసిన “కేజీయఫ్” హీరో యష్..?

Published on Apr 30, 2022 11:00 am IST

కొన్ని సినిమాలతో పలువురు హీరోలకి ఎలాంటి క్రేజ్ వస్తుందో రుజువు అయ్యింది. అప్పటి వరకు వారు చేసిన సినిమాలు అంతా ఒకెత్తు అయితే అయితే ఆ ఒక్క సినిమా ఇంకో ఎత్తులో వారిని నిలబెడుతుంది. మరి అలాగే ఇప్పుడు కన్నడకి చెందిన స్టార్ హీరోని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన చిత్రం “కేజీయఫ్”.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో యష్ పేరు మంచి కేజ్రీగా మారిపోయింది. అయితే ఇలా వచ్చిన స్టార్డం ని ఎలా వారు వినియోగించుకున్నారు అనేది అంతే ముఖ్యం. మరి దానిని ఇప్పుడు యష్ అదే విధంగా మంచి రీతిలో వినియోగించినట్టు తెలుస్తుంది.

తాజాగా యష్ చెంతకు ఒక భారీ ఆఫర్ తో ఓ ప్రముఖ ఎండోర్స్మెంట్ సంస్థ వచ్చిందట. అయితే అది పొగాకు సంబంధిత ఇలాచీ పౌడర్ ది కావడంతో యష్ నో చెప్పేశాడట. తాను ఇలాంటివి చేసి అభిమానులని ప్రేక్షకులని తప్పుదోవ పట్టించలేనని తెలిపాడట. మరి ఇప్పుడు ఈ టాక్ నే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే దీనిపై ఒక స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :