బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తున్న “కేజీఎఫ్2”

Published on May 9, 2022 2:32 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కేజీఎఫ్2. ఈ చిత్రం బాలీవుడ్ లో దూసుకు పోతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హిందీ మార్కెట్‌లో 400 కోట్ల మార్క్‌ను దాటిన తొలి కన్నడ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

విడుదలైన ఇతర హిందీ బిగ్గీలు ఫ్లాప్ కావడంతో, కేజీఎఫ్2 కి మరో అవకాశం దక్కింది. ఈ వీకెండ్ వరకూ తన సత్తా కొనసాగించే అవకాశం ఉంది. వీకెండ్ కావడంతో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 413 కోట్ల మార్క్‌ను దాటేసింది. బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అంటే మామూలు ఫీట్ కాదు మరియు ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్‌కే చెందాలి.

సంబంధిత సమాచారం :