అక్కడ “ఆర్ఆర్ఆర్” మూవీ కలెక్షన్స్ ను బీట్ చేసిన కేజీఎఫ్2

Published on Apr 17, 2022 7:07 pm IST


కన్నడ చిత్ర పరిశ్రమ కి చెందిన కేజీఎఫ్ 2 చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం కేరళ లో మరొక రికార్డ్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ చిత్రం ఇప్పటి వరకూ సాధించిన 23 కోట్ల రూపాయలను కేజీఎఫ్ 2 బీట్ చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో కేజీఎఫ్ 2 రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.

కేరళ లో విడుదల అయిన ఏ చిత్రంకు అయిన ఇవే అత్యధిక వసూళ్లు అని తెలుస్తోంది. యష్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. KGF 2 కి రవి బస్రూర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :