ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా “కేజీఎఫ్2”

Published on Apr 15, 2022 6:31 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్‌ తో ఆల్ ఇండియా లోనే టాప్ లో నిలిచింది. ఈ చిత్రం విడుదలైన రోజే హిందీలో 53.95 కోట్ల వసూళ్లు రాబట్టింది. తొలిరోజు 51 కోట్ల వసూళ్లను రాబట్టిన వార్ చిత్రం కలెక్షన్లను కేజీఎఫ్ 2 బీట్ చేయడంతో ఇది సరికొత్త రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. లాంగ్ వీకెండ్ కావడం, మౌత్ టాక్ బాగుండడంతో ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని సులువుగా క్రాస్ చేసే అవకాశం ఉంది.

తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి రెండో రోజు సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇదిలా ఉంటే, మొదటి రోజు హిందీలో ఆల్ టైమ్ కలెక్షన్స్ లిస్ట్ ఇదిగోండి.

కేజీఎఫ్ 2 – 53.95 కోట్ల రూపాయలు
వార్ – 51.2 కోట్ల రూపాయలు
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ – 50.75 కోట్ల రూపాయలు
హ్యాపీ న్యూ ఇయర్ – 42.62 కోట్ల రూపాయలు
భారత్ – 42.30 కోట్ల రూపాయలు
బాహుబలి 2 – 41 కోట్ల రూపాయలు
ప్రేమ్ రతన్ ధన్ పాయో – 40.35 కోట్ల రూపాయలు
సుల్తాన్ – 36.54 కోట్ల రూపాయలు
సంజు- 34.75 కోట్ల రూపాయలు
టైగర్ జిందా హై – 34.10 కోట్ల రూపాయలు.

సంబంధిత సమాచారం :