భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీఎఫ్2 హీరోయిన్!

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీఎఫ్2 హీరోయిన్!

Published on May 28, 2022 12:00 AM IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సీరీస్ చిత్రాలతో టీమ్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, భారీ రీచ్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సిరీస్ చిత్రాల్లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ కి సైతం కేజీఎఫ్ 2 తర్వాత భారీ డిమాండ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ హీరోయిన్ లు అడిగిన దాని కంటే ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరి నిర్మాతలు ఈ డిమాండ్ తో శ్రీనిధి శెట్టి ను తీసుకొనేందుకు ఆసక్తి చూపుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు