బాలీవుడ్ లో నేడు 400 కోట్ల క్లబ్ లోకి “కేజీఎఫ్2”

Published on May 6, 2022 7:40 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్2 చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. యశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం బాలీవుడ్ లో మరొక మ్యాజికల్ మైల్ స్టోన్ ను నేడు టచ్ చేయనుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 397 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టగా, నేడు 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి అడుగు పెట్టనుంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వసూళ్ళను రాబడుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :