తెలుగు రాష్ట్రాల్లో “కేజీఎఫ్ 2” కలెక్షన్స్ ఇవే!

Published on Apr 21, 2022 8:08 pm IST

కేజీఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. దేశంలో నాలుగు రోజుల వీకెండ్‌లో పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఈ చిత్రం విడుదలైంది. ఫలితం మనందరికీ తెలిసిందే. ఈ పిరియడ్ యాక్షన్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం రన్ పూర్తి చేసుకుంది. ఈ కన్నడ డబ్బింగ్ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.

ఈ చిత్రం ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల షేర్ సాధించింది. ఈ కలెక్షన్లతో ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏపీ, నైజాంలో సొమ్ము చేసుకున్న తీరు ట్రేడ్ పండితులను సైతం నివ్వెర పరిచింది. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేక పోవడంతో రానున్న రోజుల్లో కూడా కేజీఎఫ్ 2 భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో యష్ ప్రధాన పాత్ర పోషించాడు.

సంబంధిత సమాచారం :