అక్కడ దంచి కొడుతున్న కేజీఎఫ్2…మామూలుగా లేదుగా!

Published on Apr 24, 2022 12:00 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ అక్కడ 6 మిలియన్ డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టింది. సౌత్ బాషల్లో ఈ చిత్రం ఎక్కువగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో సైతం ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేస్తూ, 400 కోట్ల రూపాయల వసూళ్ల వైపు దూసుకు పోతుంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డు లకు చేరువయ్యే అవకాశం ఉంది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :