ఆల్ టైమ్ టాప్ 2 లోకి “కేజీఎఫ్2″…బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

Published on May 5, 2022 1:30 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్2 చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదల అయిన అన్ని చోట్ల దాదాపు భారీ రికార్డు లను సెట్ చేసిన ఈ చిత్రం అమీర్ ఖాన్ దంగల్ చిత్రం వసూళ్లను తాజాగా క్రాస్ చేయడం జరిగింది. దీంతో బాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 2 లో చోటు దక్కించుకుంది.

ఈ చిత్రం బుధవారం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో 8.75 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. మొత్తం అక్కడ ఇప్పటి వరకూ 391 కోట్ల రూపాయల వసూళ్లను దాటింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :