హిందీ లో 430 కోట్ల మార్క్ ను టచ్ చేసిన “కేజీఎఫ్ 2”

Published on May 16, 2022 7:43 pm IST


కేజీఎఫ్ 2 చిత్రం ఇప్పుడు నెమ్మదించే మూడ్‌లో లేదు. హిందీ మార్కెట్‌లో 400 కోట్ల మార్క్‌ను దాటిన తొలి కన్నడ చిత్రంగా చరిత్ర సృష్టించింది. జయేష్‌భౌ జోర్దార్ వంటి ఇతర హిందీ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో, కేజీఎఫ్2 కి మరో అవకాశం దొరికినట్లు అయింది.

వీకెండ్ కావడంతో మరోసారి మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 430 కోట్ల మార్క్‌ను దాటేసింది. బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అంటే మామూలు ఫీట్ కాదు మరియు ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్‌కే చెందాలి. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :