స్ట్రాంగ్ హోల్డ్ తో అక్కడ 250 కోట్ల క్లబ్ లోకి “కేజీఎఫ్2”

స్ట్రాంగ్ హోల్డ్ తో అక్కడ 250 కోట్ల క్లబ్ లోకి “కేజీఎఫ్2”

Published on Apr 20, 2022 12:30 PM IST

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్2. కేజీఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపు గా వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ భారీగా థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో వేగంగా 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరగా, మంగళవారం 19 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 238.7 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రం నేడు 250 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరనుంది. వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబడటం తో సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, విజయ్ కిరగందూర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు