కలెక్షన్ లలో అదే జోరు కొనసాగిస్తున్న ఖైదీ నెం 150 !

24th, January 2017 - 06:36:11 PM


రెండవ వారంలోనూ ఖైదీ నెం 150 చిత్రం అదే జోరుతో వసూళ్లు రాబడుతోంది. చాలా ఏరియాల్లో ఈ చిత్ర కలెక్షన్ లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ లలో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.

కాగా ఈ చిత్రం ఇప్పటికే 90 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. వసూళ్లు ఇదేవిధంగా కొనసాగితే త్వరలో ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది.చాలా కాలం తరువాత చిరంజీవి నటించిన చిత్రం కావడం మ్యూజిక్ బావుండడంతో మంచి వసూళ్లను రాబడుతోంది. తమిళ చిత్రం కత్తి కి రీమేక్ గా ఈ చిత్రం వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వం వహించగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.