వరుసగా రెండో రోజు కూడా ‘విజిల్’ను అధిగమించిన ‘ఖైదీ’

khaidi2

కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని గ్రిప్పింగ్ నరేషన్, కార్తీ అద్భుతమైన నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఎంతలా అంటే ఈ సినిమాతో పాటే విడుదలైన విజయ్ ‘విజిల్’ సినిమా వసూళ్లను కూడా అధిగమించింది.

‘విజిల్’ 5వ రోజు ఏపీ, తెలంగాణలో రూ. 66 లక్షల షేర్ రాబట్టగా 6వ రోజు రూ.34 లక్షలు వసూలు చేసింది. ఇక ‘ఖైదీ’ అయితే 5వ రోజు రూ.67 లక్షల షేర్, 6వ రోజు రూ.45 లక్షలు వసూలైంది. ఈ లెక్కలు చూస్తే ‘విజిల్’ మీద ‘ఖైదీ’ స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. ఇక ఓవరాల్ వసూళ్లు చూస్తే రూ.4.46 కోట్ల షేర్ రాబట్టిన ‘ఖైదీ’ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.4.30 కోట్లను క్రాస్ చేసి లాభాల్లోకి వెళ్లింది. మొత్తానికి సినిమా మాత్రం ప్రాఫిటబుల్ వెంచర్ అయింది.

Exit mobile version